Natyam ad

వందే భారత్ లో ఇరుక్కున్నాడు

రాజమండ్రి ముచ్చట్లు:


టెక్నాలజీపై అవగాహన లేక కొంతమంది అనుకొని సంఘటనల్లో ఇరుక్కోవడం మనం చూస్తుంటాం.ఎదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే చాలు దాన్ని చూసే వరకూ కొంతమంది విడిచిపెట్టరు.ఇదే సంఘటన రైల్వేస్టేషన్లో చోటు చేసుకుం ది.ఇటీవల కాలంలో కేంధ్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైల్ ను ప్రవేశపెట్టింది.సకల సదుపాయా లు,ఆదునిక టెక్నాలజీతో రూపొందించింది కేంధ్ర ప్రభుత్వం.అయితే ఈ రైల్ లో సెల్ఫీ దిగుదామని ఓ వ్యక్తి రైలెక్కి అవాక్కయ్యా డు.రాజ మండ్రిలో ట్రైన్ ఆగిన సమయంలో ఒక వ్యక్తి ఫోటో తీసుకోవటానికి ట్రైన్ ఎక్కాడు. ఫోటో దిగి మళ్ళీ కిందకు దిగటానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి.ఫోటో కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి అక్కడే ఉన్న టిసి ని డోర్ ఓపెన్ చేయాల్సిం దిగా కోరాడు. ఇక దిగటానికి ఉండదు అని…మళ్ళీ విజయవాడలోనే దిగాల్సిందే అని చెప్పటంతో అవాక్కు అవటం అతని వంతు అయింది. ఫోటో లు బయటి నుంచి తీసుకోవాలి కానీ లోపలి వస్తే ఎలా అంటూ సిబ్బంది అతనికి క్లాస్ పీకారు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. అప్పటికి డోర్ ఓపెన్ చేయించేందుకు సంప్రదించినా అది సాధ్యం కాకపో వడంతో ఆ వ్యక్తి తీసుకున్న సెల్ఫీ నిరుత్సాహానికి గురి చేసింది.

 

Tags; Vande is stuck in India

Post Midle
Post Midle