పుంగనూరు మున్సిపాలిటి సచివాలయాల కన్వీనర్‌గా వరదారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలోని జగనన్న సచివాలయాల కన్వీనర్‌గా వరదారెడ్డిని నియమించారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసారధుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పీఏ చంద్రహాస్ మాట్లాడుతూ కన్వీనర్‌గా వరదారెడ్డిని నియమించినట్లు ప్రకటించారు. నాగభూషణం మాట్లాడుతూ కన్వీనర్లు పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, లయన్స్క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags; Varada Reddy as the convener of Punganur Municipality Secretariats
