వరాహనాధుడి ఉంగరం మాయం..
భక్తులను తాడులతో బంధించి ఆలయ సిబ్బంది ఇంటరాగేషన్
అంతా క్రతువులో భాగమని తేలడంతో తేలికపడిన వాతావరణం
సింహాచలం ముచ్చట్లు:
ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. ఈ సంఘటనతో గాబ రాపడిన ఆలయ సిబ్బంది, పూజారు లు, వైదిక సిబ్బంది ఆలయంలో హడా విడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభిం చకపోవడంతో.. ఆ సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులను తాళ్లతో కట్టేసి విచారిం చారు.ఈ హడావిడి చూసిన పలువురు భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే.. ఇదంతా.. స్వామివారి వార్షి క తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించే..ఉంగరపు సేవ కార్యక్రమం లో భాగమేనని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఉంగరపు సేవ వేడుక ను వినోదాత్మకంగా నిర్వహించారు. చోరీకి గురైన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని అర్చకులు, సిబ్బంది చక్కగా నిర్వహించారు.

పలువురు భక్తులను, అధికారులను బంధించి.. చోరీకి గురైన స్వామి వారి ఉంగరాన్ని మీరే తీశారంటూ ప్రశ్నించిన తీరు భక్తు లకు వినోదాన్ని పంచింది.ఉత్సవంలో భాగంగా ముత్యాల పల్లకీలో మహా రాజా అలంకరణలో ఆశీనులైన స్వామివారి మేలి ముసుగులో బంగా రు ఉంగరం దొరకడంతో వినోదోత్సవం ఉత్సాహంగా ముగిసింది. అనంతరం ఆలయ భోగమండపంలో స్వామి, అమ్మవార్ల సంవాదోత్సవం సంప్రదా యబద్ధంగా నిర్వహించారు. ఉంగరం లేకపోతే లోనికి రానివ్వబోమని అమ్మవార్లు స్వామి వారిని గుమ్మం ఎదుటే తలుపులు మూసి వేసిన ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. సంవాద సేవ అనంతరం అమ్మవార్లు ప్రసన్నం కావడంతో.. అమ్మవారు, స్వామివారి తరఫున భక్తులు పూల బంతులు విసురుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బేడామండపంలో తిరువీధి, పూర్ణాహుతితో ఉత్సవం ముగిసింది.
Tags; Varahanadhu’s ring is lost..
