Natyam ad

వారాహి యాత్ర విజయవంతం చేయాలి

అవనిగడ్డ ముచ్చట్లు:

 


పేదల గొంతుగా మారిన పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వైసీపీని వణికిస్తున్నాయని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకుడు పోతిన మహేష్ అన్నారు.  అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి చేపట్టిన నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  వారాహి యాత్ర ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అనుక్షణం అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.  రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోటున్నట్లు తెలిపారు.  అవనిగడ్డ నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర అద్భుతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

Tags: Varahi Yatra should be successful

Post Midle
Post Midle