మే 10న “నాగకన్య – గ్రాండ్ రిలీజ్

On May 10th "Nagakanya - Grand Release
Date:18/04/2019
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా… ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా మే 10న గ్రాండ్ గా విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ తో పాటు ఆడియోకి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది, ఈ నేప‌థ్యంతోనే మే 10న నాగ‌క‌న్య ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ చిత్రం ట్రైలర్  కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా మే 10న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నాం. వేస‌విలో పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా నాగ‌క‌న్య చిత్రాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అని అన్నారు.
Tags:Varagakshmi, Katherine, Lakshmi Rai starring on May 10th “Naganai – Grand Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *