వరలక్ష్మీ వ్రతం మగళకరం
విశాఖపట్నం ముచ్చట్లు:
శ్రావణ మాసం లో ప్రతి ఇంట భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత మంగళకరం అని ప్రముఖ సంఘ సేవకులు, వివేకానంద సంస్ధ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. గురువారం పాతనగరంలోని వివేకానంద అనాధ, వృద్ధాశ్రమంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సమకూర్చిన బంగారు కాసులు, పట్టు చీరలు సంస్ధ
మహిళా సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ అహ్మద్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వృద్ధులు, అనాధలకు నిరంతరం సేవలందిస్తున్న మహిళా సభ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు. కరోనా లో సైతం వీరు నిరంతరం ప్రాణాలు ఎదురొడ్డి ఎంతో మందికి తమ సేవలు అందించారన్నారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు ఇతరులకు సహాయం చేయాలన్నారు. ధనం శాశ్వతం కాదని చేసిన దానం మాత్రమే శాశ్వతంగా నిలిచి పోతుందన్నారు. గతంలో కూడా ఈ ఆశ్రమానికి తన వంతు విరాళంగా నిధులు, మంచాలు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రౌండ్ టేబుల్ చైర్మన్ మక్సూద్ అహ్మద్, సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
Tags; Varalakshmi Vrat is auspicious

