అమ్మవారిశాలలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవి మాత

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న 164 మంది వెండి రథం ఉభయదాతలు

బద్వేలు ముచ్చట్లు:

బద్వేలులో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా  ఆర్యవైశ్య వర్తకసంఘం  ఆర్యవైశ్య మహిళామండలి వారి ఆధ్వర్యంలో వెండి రథంకు సహకరించిన 264, మంది శాశ్వత ఉభయదాతలకు అంగరంగ వైభవంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య  వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరలక్ష్మివ్రతంలో పలువురు మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదారులకు  ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కె.వి సుబ్బారావు మహిళా మండలి అధ్యక్షురాలు చింతకుంట ధనలక్ష్మితో పాటు పలువురు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

Tags: Varalakshmi vratam in splendor at Ammavarishala

Leave A Reply

Your email address will not be published.