ఏఎన్ఎంల వరలక్ష్మీ వ్రతం
ఖమ్మం ముచ్చట్లు:
సెకండ్ ఏ.ఎన్.ఏం ల నిరసన దీక్ష పదకోండో రోజుకు చేరింది.కొత్త కలెక్టరేట్ దగ్గర రోజుకో రీతిలో తమ నిరసనను తెలియ చేస్తున్నారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఇంటిదగ్గర చేయవలసిన వరలక్ష్మి వ్రతం కలెక్టరేట్ దగ్గర టెంటు కింద జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వం లో ఉండి సేవలందిస్తున్నామని నోటిఫికేషన్ ఇవ్వకుండా రెగ్యులరైజేషన్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా కష్టకాలం లో కూడా ప్రాణాలకు తెగించి సేవాలాందించాం మాకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నారు. మా సెకండ్ ఏఎన్ఎం లలో ఏజ్ బార్ అయినా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి నోటిఫికేషన్ పరీక్షలు లేకుండా మాకు రెగ్యులరైజేషన్ చేయాలనీ కోరుతున్నరు.
Tags: Varalakshmi Vratam of ANMs

