పవన్ ను టార్గెట్ చేసిన వర్మ

పవన్ ను టార్గెట్ చేసిన వర్మ

పవన్ ను టార్గెట్ చేసిన వర్మ

Date:14/ 05/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
వివాదాల వర్మ పవన్‌ కళ్యాణ్‌ను మళ్లీ టార్గెట్ చేస్తున్నాడు. జనసేన అధినేత తిరుమల టూర్‌పై ట్విట్టర్‌లో చెలరేగిపోయాడు. శనివారం రాత్రి పవన్ కాలినడకన కొండపైకి వెళ్లి… ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే మెట్ల మార్గంలో అలసట రావడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. దీనిపైనే ఆర్జీవీ వివాదాస్పద కామెంట్ చేశారు. ఈ ఫోటోను వర్మ ట్వీట్ చేస్తూ… పవర్ స్టార్ పవర్ ఫుల్ ఎనర్జీకి ఇదే నిదర్శనమంటూ సెటైర్ వేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి… వర్మకు కౌంటర్ ఇచ్చారు. కెలకమాకు సామీ …కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు. ఇది మీకు హుందా అయినది కాదు… తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండన్నారు. రామజోగయ్య శాస్త్రి మాత్రమే కాదు… పవన్ ఫ్యాన్స్ కూడా వర్మపై విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పాత ఫోటోలను కామెంట్స్‌గా పెడుతూ కొందరు కౌంటరిస్తే… ఆయనకు పిచ్చి పట్టిందంటూ మండిపడ్డారు. నిన్నటికి నిన్న నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్‌లో రవితేజ-పవన్ ఫోటోపై వివాదాస్పద ట్వీట్లు చేశారు వర్మ. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటూ నెటిజన్ల నుంచి కూడా గట్టి కౌంటర్లు వచ్చాయి. అయినా ఆర్జీవీ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. మళ్లీ పవన్ తిరుమల పర్యటనను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు.
Tags:Varma to target Pawan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *