వ‌రుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంట‌గా ‘ఇందువదన’ చిత్రం నుంచి విడుద‌లైన‌ వ‌డి వ‌డిగా పాట‌కు అనూహ్య స్పంద‌న‌

హైదరాబాద్‌ ముచ్చట్లు:

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్మెస్పార్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. ఇందువదన సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇటీవ‌లే విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన అందుకుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్  కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్పార్. ఆ తరువాత విడుదలైన ప్ర‌తి ప‌బ్లిసిటీ కంటెంట్ కి క్షణం మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ వ‌డి వ‌డిగా సైతం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాట‌లో వ‌రుణ్, ఫ‌ర్నాజ్ మ‌ధ్య కెమిస్ట్రీ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక‌ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్తియింది, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. ఇన్ఫీనిట‌మ్ మ్యూజిక్, బిలీవ్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో ల‌భిస్తుంది.
నటీనటులు:  వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి, జెర్సీ మోహన్ తదితరులు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Varun Sandesh and Farnaz Shetty have released an unexpected response to the song ‘Vadivadi’ which was released from the movie ‘Induvadan’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *