బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు
బాసర ముచ్చట్లు:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు రెండవ రోజు వేకువ జామున వేద పండితులు అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు.
వసంత పంచమి ఉత్సవాలు సందర్భంగా ఆలయ అధికారులు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి మహాకాళి మహాలక్ష్మి అమ్మవారి ఆలయలను ఆలయ అధికారులు విద్యుత్ దీపాలతో, వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు వేకువ జామున నుండి పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి సరస్వతి, మహాకాళి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీసూర్యేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
Tags: Vasant Panchami celebrations in Basara

