Natyam ad

కోస్తాలోనూ వసంత కృష్ణ ప్రసాద్

విజయవాడ ముచ్చట్లు :

ఎన్నికలు దగ్గర పడే సమయంలో అధికార వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగానే బయట పెడుతున్నారు. పార్టీకి ఇది డ్యామేజీ తెస్తుందని తెలిిసినా వైసీపీ నేతలు పార్టీ లైన్ ను థిక్కరించడానికే రెడీ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి నియోజకవర్గం సమన్వయ కర్తగా నేదరుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. అంటే ఒక రకంగా ఆనం రామనారాయణరెడ్డికి పొమ్మన లేక పొగబెట్టినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.ఇక తాజాగా కోస్తా ప్రాంతంలోనూ వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో పాటు అతని తండ్రి వసంత నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయి. వసంత తండ్రి వసంత నాగేశ్వరరావు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దేవినేని ఉమకు వ్యతిరేకంగా కలిశారని భావిస్తున్నా, ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేశాయని చెప్పాలి. ఆయన కామెంట్స్ తో తనకు సంబంధం లేదని వసంత కృష్ణప్రసాద్ చెప్పినా అధినాయకత్వం మాత్రం సీరియస్ గానే తీసుకుంది.వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహరం చర్చనీయాశంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌తో వసంతకు ఉన్న విభేదాలు బహిర్గతంకావటంతో వివాదం తెర మీదకు వచ్చింది.

 

 

 

Post Midle

ఈ వివాదంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా శ్రద్ద చూపింది. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్‌తో విడివిడిగా ప్రభుత్వ పరిశీలకుడు సజ్జల సమావేశం అయ్యారు. ఇరువురు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఈ వివాదం కొలిక్కిరాలేదు.మైలవరంలో జోగి రమేష్‌, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం కొనసాగుతుండగానే… వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరో చిచ్చు రేపారు. దీంతో వసంత కృష్ణ  ప్రసాద్‌ మరింత ఇరకాటంలోకి వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు తన తండ్రి వ్యక్తిగతమని అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని వసంత క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వసంతను టార్గెట్‌గా చేసి పార్టీలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్‌ ఎమ్మెల్యే వసంత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహరంలో కూడా మంత్రి జోగి రమేష్ లేనిపోని విషయాలు ప్రచారం చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జోగి రమేష్ వర్గం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని చెబుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నారని, ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని కూడా ప్రచారం చేసిందని టాక్. అందుకే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు, మర్రి రాజశేఖర్ వంటి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత…

 

 

 

జోగి రమేష్ తన నియోజకవర్గంలో చేతులు పెట్టి గందరగోళ పరచడమేంటని నిలదీశారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యేను కాదని మరో వ్యక్తి రాజకీయాలు చేయటంపై పార్టీ పెద్దలు కూడా సరైన రీతిలో స్పందించలేనే అభిప్రాయాన్ని వసంత వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్‌ను సముదాయించేందుకు విషయాలను పార్టీ అగ్రనాయకత్వం వద్దకు తీసుకువెళ్ళి అవసరమైతే మరోసారి జగన్‌తో భేటీకి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మరణానికి కారణమైన ఉయ్యూరు శ్రీనివాస్ ను వెనకేసుకు రావడం పార్టీని ఇబ్బంది పెట్టింది. పార్టీ హైకమాండ్ కూడా వసంత పట్ల కొంత ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. మైలవరంలో గత కొంత కాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. మంత్రి జోగి రమేష్ కు చెందిన వర్గం ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. దీనిపై ఇరువురిని పిలిచిన హైకమాండ్ పంచాయతీకి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించింది. వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

 

 

 

దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న టాక్ వినపడుతుంది. మరోమారు వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం 55 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందని, ఏనాడూ పోరంబోకులను పక్కన వేసుకుని రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. చనుమోలు వెంకట్రావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు తరహాలో తాను రాజకీయాలు చేస్తున్నానని, అది ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నాటి రాజకీయాలు నేడు లేవని, ప్రతిపక్షాలపై తాను తప్పుడు కేసులు బనాయించనని, అందుకే తనపై పార్టీలో కొందరికి అసంతృప్తి అని కామెంట్ చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ వసంతపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి తరహాలోనే సమన్వయ కర్తను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీ ఇన్నర్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

 

Tags: Vasantha Krishna Prasad in Kosta too

Post Midle