Natyam ad

శ్రీవారికి వసంతోత్సవం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీవారి బ్రహోత్సవాలు  9వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో పూజలు, హోమాలు నిర్వహించారు. శ్రీవారికి వసంతోత్సవం నిర్వహించి, పట్టణ పురవీధులలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై గోవిందనామస్మరణలతో పులకించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Post Midle

Tags: Vasantotsavam for Shri

Post Midle