శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వేదఘోష
– ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు
– ప్రముఖ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు
– ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద విద్వత్ సదస్సు

తిరుపతి ముచ్చట్లు:
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ మరియు ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఉదయం 5 నుడి 5.45 గంటల వరకు వేద విద్యార్థులు చతుర్వేదాలతో వేదఘోష వినిపిస్తారు. ఉదయం 5.45 నుండి 6.45 గంటల వరకు దేశంలోని ప్రముఖ పండితులతో వేద విజ్ఞానంపై సదస్సు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా మహా మహోపాధ్యాయ చిర్రావూరి శ్రీరామశర్మ, వేదాంత విశారద శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి, డాక్టర్ అల్లాడి మోహన్, ఆచార్య చక్రవర్తి రంగనాథన్, రాణి సదాశివ మూర్తి, దేవనాథన్, కృష్ణమూర్తి వంటి వేద శాస్త్రజ్ఞులు పంచదశ మేమిగ్వే సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, వేద సంబంధమైన సంస్కారాలు, కఠోపనిషద్, ఆధునిక శాస్త్రాలలో వేదాల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు.
అదేవిధంగా ప్రతి రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ప్రముఖ గాయకులు ఫణినారాయణ, నేమని పార్థసారధి, డాక్టర్ మోహన్ కృష్ణ, శ్రీనిధి, పవన్‌కుమార్ చరణ్, ప్రొఫెసర్ శైలేశ్వరి, రాణి శ్రీనివాస శర్మ, వాసురావు, మొదుముడి సుధాకర్, శ్రీరామాచారి తమ బృందాలతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్
భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. టీటీడీ ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Tags:Veda Ghosha in Brahmotsavall of Srivari Navratri
