పుట్టపర్తిలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం

Date:19/10/2020

పుట్టపర్తి ముచ్చట్లు

 

లోక కల్యాణార్థం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించారు. మొదట ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్‌ మందిరంలో వేదపండితులు సత్యసాయి మహాసమాధి వద్ద పూజలు చేశారు. అనంతరం కొండావధాని ఆధ్వర్యంలో పండితులు యజ్ఞ కలశం తీసుకుని పూర్ణచంద్రహాలుకు చేరుకుని.. అక్కడ వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞాన్ని ప్రారంభించారు.మొదట అధినాయకుడు వినాయకుడి పూజతో మొదలు పెట్టారు. సూర్య నమస్కారం, సరస్వతి, గాయత్రి, ఆదిశక్తి, అష్టలక్ష్మి, సర్వదేవతార్చనలతో యజ్ఞం నిర్వహించారు. ప్రతిఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సంధర్భంగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు ఈ యజ్ఞం నిర్వహించనున్నారు. వేద పండితులకు ట్రస్టు సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌ పట్టు వస్ర్తాలందజేశారు. వేలాది భక్తులు పాల్గొని యజ్ఞం తిలకించారు.

చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రి అనిల్ కు లేదు

Tags:Vedic Purusha Week Jnanayagnam at Puttaparthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *