శంషాబాద్ లో వీరగం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

శంషాబాద్‌లో బీహారీలు వీరంగం సృష్టించారు. గొల్లపల్లిలో రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తున్నారు బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వాారిపై దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులపై రాడ్లు, కర్రలతో దాడి చేసారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి.పోలీసులకు బాధిత యువకులు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్నారు దాడి చేసిన బీహారీ యువకుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ… బీహార్ యువకులకు ఇష్టానుసారంగా ఇళ్లకు అద్దెకు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఇంటి యజమానులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.దీంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాడులు చేసిన వారు రేపు ప్రాణాలు తీస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే పెట్రోలింగ్ ను పెంచాలంటున్నారు గొల్లపల్లి గ్రామస్తులు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Veeragam in Shamshabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *