మద్యం మత్తులో వీరాంగం

-ఇద్దరు మృతి..మరికొందరికి గాయాలు
 
శ్రీకాకుళం ముచ్చట్లు:
 
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట లో సొంత కుటుంబ సభ్యులపై రీసు అప్పన్న అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో అప్పన్న భార్య
అక్కమ్మ, ఆయన సోదరి చెల్లుబోయిన రాజు అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుని తండ్రి,మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులపై దాడి చేసిన అనంతరం నిందితుడు
అప్పన్న కత్తితో పొడుచుకున్నాడు. నిందితుడు అప్పన్న కళ్ళు గీత కార్మికుడు. రక్తపు మడుగులో అప్పన్న కుటుంబం ఉండటాన్ని గమనించిన స్టానికులు పోలీసులు కు సమాచారం ఇచ్చారు. కుటుంబ
కలహాలు నేపథ్యం ఈ ఘటనకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో అప్పన్న కత్తితో వీరంగం సృష్టించినట్టు సమాచారం.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Veerangam in alcohol intoxication

Natyam ad