పూలంగి సేవలో పునీతుడైన వీరాంజనేయ స్వామి

Veeranjaneya Swamy who is a saint in the service of Pulangi

Veeranjaneya Swamy who is a saint in the service of Pulangi

Date:12/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ వై. కుర్రప్పల్లిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలను ఆలయ అర్చకులు కె. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయం చోళ రాజుల కాలంలో ప్రతిష్ఠించారు. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో దాతల దాతృత్వంతో… దేవాదాయ శాఖ, గ్రామస్థుల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా 2012వ సంవత్సరంలో పునః ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు, అభిషేకాలతో పాటు స్వామివారికి ప్రీతిపదమైన పూలంగి సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పౌర్ణమి రోజున ఆలయం ఎదుట చలువ పందిళ్లు వేసి ఆలయానికి విద్యుత్తు దీపాలంకరణ చేయడంతో నూతన శోభను సంతరించుకుంటుంది. పౌర్ణమి అంటే వై. కుర్రప్పల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలల్లో రాత్రంతా కోలాటాలు, చెక్కభజనలతో గ్రామంలో భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

 

మినీ గో కులాలకు నిధులు కేటాయించాలి

 

Tags:Veeranjaneya Swamy who is a saint in the service of Pulangi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *