పుంగనూరులో 1న వాహనాలు వేలం- సీఐ గంగిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం కేసుల్లో పట్టుబడ్డ వివిధ వాహనాలను డిసెంబర్ 1న వేలం వేయనున్నట్లు అర్భన్ సీఐ ఎం.గంగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నాటక నుంచి మధ్యం తరలిస్తున్న 28 వాహనాలను, ఒక ఓమిని కారును గతంలో సీజ్ చేశామన్నారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సీజ్ చేసిన వాహనాలను ఉదయం 10 గంటల నుంచి వేలం వేస్తామన్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.2 వేలు ధరావత్తు చెల్లించి పాల్గొనాలని కోరారు. నిబంధనల మేరకు వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.

Tags: Vehicle auction on 1st in Punganur- CI Gangireddy
