Date:05/12/2020
ములుగు ముచ్చట్లు:
ములుగు జిల్లా ఏటూరునాగారం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని నెషనల్ హై వే 163 జాతీయ రహాదారి పై బొలెరో వాహనం లో కూలీలు మిరప తోట పనులకు వెళుతున్నారు. వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో సుమారు 30 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడం తో ఏటూరునాగారం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తరువాత విషమంగా ఉన్న కూలీలను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి స్థానిక సి.ఐ కిరణ్ కుమార్, తహసీల్దార్ రవీందర్, ఎస్.ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఏటూరు నాగారం సి.ఐ మాట్లాడుతూ బొలెరో వాహన యజమాని పై కేసు పెడతామని, అజాగ్రత్తగా ఎక్కువ మంది ఎక్కించుకోవడం వల్ల ఈ ప్రమాదము చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు.
చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి
Tags: Vehicle overturns… 30 injured