ముగిసిన వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు
-ఎంఆర్.పల్లి సర్కిల్‌లో వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఆర్.పల్లి సర్కిల్ వద్దగల వెంగమాంబ విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.అన్నమాచార్య కళామందిరంలో ఉదయం పి.శ్రీనివాసకుమార్, ఆర్.శ్యాంకుమార్ బృందం సంగీత సభ నిర్వహించారు. ఆ తరువాత సీతాలక్ష్మి హరికథ వినిపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్.సుశీల, టి.తేజోవతి బృందం సంగీత సభ జరుగనుంది.ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత తదితరులు పాల్గొన్నారు.
Tags:Vengamamba 205th birth anniversary celebrations concluded
