Natyam ad

ముగిసిన వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు- వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి.ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు ఉదయం పుష్పాంజలి సమర్పించారు.అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మధుసూదన రావు బృందం సంగీత సభ జరిగింది. ఉదయం 11.30 గంటలకు శ్రీ చంద్ర శేఖర్ భాగవతార్ హరికథ గానం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎస్వీ సంగీత నృత కళాశాల ఆధ్యాపకులచే నృత్య కార్యక్రమం జరుగనుంది.

Post Midle

తరిగొండలో…

తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆ తరువాత సంగీత, హరికథ కార్యక్రమాలు నిర్వహించారు.

Tags:Vengamamba 293rd birth anniversary celebrations concluded- Flower offering to Vengamamba idol

Post Midle