Natyam ad

పాక హోటల్ లో వెంకయ్య నాయుడు అల్పాహరం

విజయవాడ ముచ్చట్లు:


మంగళవారం  ఉదయం విజయవాడ లోని ఎస్ఎస్ఎస్  పాక హోటల్ లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చక్కటి ఇడ్లీని ఆస్వాదించారు. తరువాత అయన మాట్లాడుతూ నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందని అన్నారు. గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి వెంకయ్య  అభినందనలు తెలిపారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని అయన వ్యాఖ్యానించారు.

 

Tags; Venkaiah Naidu breakfast at Paka Hotel

Post Midle
Post Midle