Natyam ad

కందుకూరి జీవితంపై పుస్తకంఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో నవయుగ వైతా ళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ… కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురా చారాలు రూపుమాపిన వ్యక్తి కందు కూరి అని… ఆయన కార్య వీర సూరు డు అని కొనియాడారు. సాధారణ తెలుగు పండితుడు… అసాధారణ కార్యాలు చేసిన వ్యక్తి అని అన్నారు. సాహిత్యం ప్రజల హితం కోరాలని… కందుకూరి జీవితాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలని సూచించారు. 19 వ శతాబ్దం చివరిలో సామాజిక చైతన్య తీసుకొచ్చిన వ్యక్తి కందుకూరి అని అన్నారు. సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించా రని… స్త్రీ విద్య కు ప్రాధాన్యత ఇచ్చా రని అన్నారు. తెలుగు భాషను వాడుక భాషగా మార్చారని చెప్పుకొచ్చారు. సంక్లిష్ట భాషవాడకుండా సులువుగా అర్ధమయ్యే రీతిలో రచన చేశారన్నా రు.పుస్తకాన్ని రచించిన ఆచార్య సిమ్మన్నను వెంకయ్యనాయుడు అభినందించారు.

 

Tags; Venkaiah Naidu who launched a book on the life of Kandukuri

Post Midle
Post Midle