మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా మూవీ
హైదరాబాద్ ముచ్చట్లు:
RRRతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారు. ఉప్పెన వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సాన మెగా పవర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయబోతు్నారు. రామ్ చరణ్‌కున్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా బుచ్చిబాబు ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేశారు.
పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తోంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై హ్యూజ్ స్కేల్లో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా ద్వారా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా గ్రాండ్ లెవల్లో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు: రామ్ చరణ్

Tags; Venkata Satish Kilaru in Mega Power Star Ram Charan, Buchibabu Sana Combination, Vriddhi Cinemas, Mythri Movie Makers, Sukumar Writings Pan India Movie
