సాంకేతిక సహాయకుల జిల్లా అధ్యక్షుడుగా వెంకటరమణారెడ్డి ఎన్నిక
చౌడేపల్లె ముచ్చట్లు:
మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం సాంకేతిక సహాయకుల జిల్లా అధ్యక్షుడిగా కె. వెంకటరమణారెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ఆదివారం తెలిపారు. కార్యవర్గం ఎన్నికలు చిత్తూరు లోని ఎన్‌జిఓ భవనంలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడుగా వెంకటరమణారెడ్డి ఉపాధ్యక్షుడిగా కె.మహేంద్ర,హంసవేణి,కార్యదర్శి సతీష్,కోశాధికారి విశ్వనాథన్, సంయుక్త కార్యదర్శులు పి. గోపి,కె.మునిరాజ,వి.జయచంద్ర లను ఎన్నుకొన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. మోహన్,టి. దేవేంద్ర, రామమూర్తిలతోపాటు మరో ఇరవైమంది కార్యవర్గసభ్యులుగా ఎన్నికైయ్యారు. నూతనంగా ఎన్నికైన వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉపాధి పథకంను సమర్థవంతంగా లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు. ౖసిబ్బంది సమస్యలను పరిష్క్రరించి ఉద్యోగ భద్రత తోపాటు కనీస వసతుల కల్పన కు కృషిచేస్తామన్నారు. నూతన కార్యవర్గంను జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ గంగాభవాని అభినందించారు.

Tags: Venkataramana Reddy was elected as the District President of Technical Assistants
