Venkateshu assumes duties as new EO

కాణిపాకం ఈవోగా వెంకటేశు

Date:05/06/2020

కాణిపాకం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా వెంకటేశు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటి కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయనను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండ అందరికి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామన్నారు. స్వామి సన్నిధిలో పని చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. కాగా చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాలలో తహశీల్ధార్‌గా పని చేసిన ఈవో వెంకటేశుకు జిల్లాపై పూర్తిగా అవగాహన ఉండటం గమనార్హం.

మేక మాంసం తిని ఒకరు మృతి..25 మందికి అస్వప్థత

Tags: Venkateshu assumes duties as new EOVenkateshu assumes duties as new EO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *