Natyam ad

లంకవాసులకు విషసర్పాల ముప్పు

అల్లూరి సీతారామరాజు ముచ్చట్లు:

జిల్లాలోని విఆర్ పురం, కూనవరం మండలాల్లోని లంక వాసులు  విషసర్పాల కాటుకు బలవుతున్నారు. మరోవైపు,  గోదావరి వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  జీవనం సాగిస్తున్నారు. రాత్రి వేళ చిమ్మ చీకట్లో అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గుడారాల్లో విష సర్పాల కాటుకు గురవువుతున్నారు. వరదలతో విలీన మండలాల వాసుల ఇళ్ళు నీట మునగడంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పలుచోట్ల అడవుల్లోనే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. పురామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం ముంపునకు గురి కావడంతో ఆ గ్రామస్తులు సమీపంలోని అడవిలో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన సుబ్బయ్య (45) పాము కాటుకు గురయ్యారు. గ్రామానికి అన్ని వైపుల వరద ఉండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో స్థానికులు పడవ కోసం ప్రయత్నించగా సకాలంలో అది రాలేదు. దీంతో వైద్యం అందక బాధితుడు మృతి చెందాడు.  కూనవరం మండలంలోని కోతల గుట్ట పునరావాస కేంద్రంలో ఉంటున్న కూనవరానికి చెందిన సంపతి రమణయ్య సోమవారం వరద తగ్గడంతో ఇల్లు కడిగేందుకు ఉదయ భాస్కర్ కాలనీకి వెళ్లారు. ఇంట్లోని బిందెను పట్టుకోగా అందులో ఉన్న పాము కాటేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Tags: Venomous snakes are a threat to Sri Lankans

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.