అడ్డగూడూరు మహిళ లాకప్‌డెత్‌పై నిజనిర్దారణ కమిటీ విచారణ

– మరియమ్మను నిర్బంధించి, మానవ హక్కుల ను ఉల్లంఘించి చంపేశారు

 

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రాచకొండ డివిజన్‌లోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మహిళ లాకప్ డెత్‌పై నిజనిర్దారణ కమిటీ విచారణ  చేపట్టింది. అడ్డగుడూర్‌లో పర్యటించిన పౌర హక్కుల ప్రజా సంఘం ప్రతినిధులు, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులను  పరిశీలించారు. అడ్డగూడూరు పోలీసులు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారని  పౌర సంఘాలు తెలిపాయి. మరియమ్మను నిర్బంధించి, మానవ హక్కుల ను ఉల్లంఘించి, మరియమ్మను చర్చి ఫాథర్‌తో కలిసి చంపేశారని పౌరసంఘాలు ఆరోపించాయి. ఈ కేసుకు సంబంధించిహైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరాయి.

 

 

నష్ట పరిహారంగా రూ.25 లక్షలు మరియమ్మ కుటుంబానికి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చావు బతుకుల మధ్య ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని… ప్రభుత్వం వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మరియమ్మ మరణానికి సాక్షులుగా ఉన్న చర్చి రికార్డ్స్‌ను, పోలీస్ రికార్డ్స్‌ను వెంటనే సీజ్ చేయాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని పట్టుబట్టారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సీపీ మహేష్ భగవత్ ఇప్పటికే ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Verification committee probe into cross-border woman lockup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *