కాంట్రాక్టు ఆర్టీసీ ఉద్యోగుల నిలువు దోపిడి

ఒంగోలు  ముచ్చట్లు:
ఆర్‌టిసిలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంతో దయనీయంగా మారింది. ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారో… ఎప్పుడు వద్దంటారో… అని కాంట్రాక్ట్‌ ఏజెన్సీల కింద వెట్టి చాకిరికి మారుపేరుగా మారుతున్నారు. ఎపిఎస్‌ ఆర్‌టిసి ఉద్యోగులను మొత్తం ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రజారవాణా శాఖగా మారి, ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారినా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీల కింద నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమజీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశించిన ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రటించకముందు 2020 మార్చి దాకా ఆర్‌టిసిలో 7500 మంది వరకు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉండే వారు. కోవిడ్‌ తగ్గాక జూన్‌ నుంచి పూర్తిస్థాయిలో ఆర్‌టిసి సర్వీసులను నడిపినా కేవలం 4000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకొని మిగిలిన సిబ్బందిని రోడ్లుమీదే వదిలేశారు. రెండోవేవ్‌లో సర్వీసుల సంఖ్య కుదింపు పేరుతో ఆ 4000 అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కూడా విధులకు దూరంగా పెట్టారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆప్కాస్‌లో విలీనం చేయాలని, విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల వారి దయనీయమైన దుస్థితిపై ఇటీవల ఆర్‌టిసి ఎమ్‌డి దృష్టికి తీసుకెళ్లడంతో మళ్లీ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు విడుదలయ్యాయి. కోవిడ్‌ రెండోవేవ్‌లో కూడా పూర్తిస్థాయిలో బస్సులు తిరిగే పరిస్థితి లేనందున 50 శాతం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల పట్ల అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది హతాశులయ్యారు. ఇప్పుడున్న ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో మరికొంత మందిని ప్రభుత్వం ఇళ్లకు పంపేలా వ్యవహరిస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బయట కాంట్రాక్టర్‌ కింద ఉండరాదనే లక్ష్యంతో ఏర్పాటుచేసిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో అన్ని ప్రభుత్వ శాఖల అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విలీనం కాగా, ఆర్‌టిసిలో మాత్రం ఇంకా ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల కిందే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమను ఆప్కాస్‌లో విలీనం చేయాలని కోరుతున్నా… ఆర్‌టిసి యాజమాన్యం మాత్రం ప్రైవేట్‌ ఏజెన్సీల కిందే మిగిలిపోయారు.అయితే ఆర్‌టిసిలోని ఓ కీలక అధికారి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆప్కాస్‌లో విలీనం కాకుండా మోకాలొడ్డుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని మొత్తం 7500 మంది ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆప్కాస్‌లో విలీనం చేయాలని, విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.నూర్‌మహ్మద్‌ కోరారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Vertical exploitation of contract RTC employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *