Very moderate rain in several cities

జంటనగరాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం

Date:09/04/2020

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో పలుచోట్ల వర్షం పడుతుంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జేబీఎస్‌, కార్కానా, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తెలంగాణకు రాగల మూడు రోజులు వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఓ మోస్తారు నుంచి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

కరోనా మబ్బుల్లో.. ఎంఎస్‌-16 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప‌రీక్షించిన ర‌ష్యా

Tags: Very moderate rain in several cities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *