వృద్ధి రేటుపై కీలక వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌…!

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

 

భారత ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రెండంకెల వృద్ధి రేటును నమోదుచేస్తోందని రాజీవ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ కూగా సాఫీగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌-19 కారణంగా మొదటి, రెండో వేవ్‌లో రాష్ట్రాలు ఎదుర్కొన్న తీరు రాబోయే కాలంలో వచ్చే కోవిడ్‌-19 వేవ్‌లను దేశం, రాష్ట్రాలు ఎదుర్కొనే స్థితి వస్తోందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.కోవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ నుంచి ఇబ్బందులను అధిగమించామని, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఎకనామిక్‌ రికవరీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఫిచ్‌ లాంటి పలు రేటింగ్‌ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తగ్గించాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న రికవరీతో అదే సంస్థలు తిరిగి వృద్ధి రేటును సవరించే అవకాశాలు ఉన్నాయని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

 

 

 

2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం కుదించింది. ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీలు ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగా, ఫిచ్ రేటింగ్స్ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం నమోదు చేస్తోందని తెలుపగా తిరిగి వృద్ధిరేటును 10 శాతానికి సవరించింది. ఉక్కు, సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో కొన్ని రంగాలలో సామర్థ్య విస్తరణలో గణనీయమైన పెట్టుబడులు ఇప్పటికే జరుగుతున్నాయాని పేర్కొన్నారు. కన్యూసమర్‌ డ్యురాబుల్‌ సెక్టార్‌లో కరోనాతో వినియోగదారుల్లో అనిశ్చితి నెలకొలడంతో పెట్టుబడులను పెట్టేందుకు కాస్త సంకోచాలకు గురవౌతున్నారని తెలిపారు. పూర్తిస్తాయి ప్రైవేట్‌ పెట్టుబడి రికవరీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అదనంగా 23,123 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. దీంతో కోవిడ్‌-19 ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వారి ప్రకటనలు ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ అంచనాలను అధిక స్థాయిలో ఉంచలేదని చాలా స్పష్టంగా తెలియజేశాయి. ప్రస్తుతం ఇది తాత్కాలికమైన, ఆర్బిఐ నిర్ధేశించిన ద్రవ్యోల్భణ స్థాయి లక్ష్యాలను కచ్చితంగా  చేరుకుంటామని రాజీవ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Vice Chairman of the Nitish Aayog made key remarks on the growth rate …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *