పెద్దపంజాణి మండలంలో గడపకు గడపకు వైస్సార్సీపీ కార్యక్రమం

ViceScryse program for Gadappa in the big zone

ViceScryse program for Gadappa in the big zone

Date:19/09/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పలమనేరు నియోజకవర్గం లోని పెద్దపంజాణి మండలంలో గడపగడపకు వైస్సార్సీపీ కార్యక్రమం జరిగింది. వైకాపా అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపిపి ఆర్. విజయభాస్కర్ రెడ్డి అద్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎన్.వెంకట్ గౌడ తొలిసారిగా మండలంలో పర్యటించారు.

 

ప్రజలు, వైస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున వైకాపా నాయకులకు పూలమాలు వేసి, మహిళలు మంగళ హారతులతో  ఘనస్వాగతం పలికారు.   ‘రావాలి జగన్ – కావాలి జగన్ ‘ నయా స్లోగన్ తో శంకర్రాయలపేట పంచాయతీ లో గడప గడపకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

వైకాపా రూపొందించిన ‘నవరత్నాలను’ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో వైకాపా మండల కన్వీనర్ బాగారెడ్డి, రాష్ట్ర, జిల్లా, కార్యదర్సులు వికోట వాసు, రాయలపేట డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు రెడ్డెప్ప, సుహేబ్, యరబల్లి శ్రీనివాసులు, మండలం ఎస్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు,యువ నాయకులు, వైస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags:ViceScryse program for Gadappa in the big zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *