పుంగనూరులో విజయోత్సవ సంబరాలు నిషేధం

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికలలో గెలుపొందిన వారి విజయోత్సవ సంబరాలను నిషేధిస్తున్నట్లు సీఐ రాఘవరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామన్నారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలను స్నేహపూర్వకంగా తీసుకోవాలని, ఎవరు విధ్వేషాలకు లోనుకాకుండ ఉండాలన్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారికి ఏపార్టీల నాయకులు, కార్యకర్తలు గెలుపు, ఓటమిలను పట్టింపులకు తీసుకోవద్దన్నారు. కౌంటింగ్‌, తరువాత ప్రశాంతంగా ఉండాలని ప్రజా జీవనానికి ఎవరు విఘాతం కలిగించవద్దని కోరారు.

 

Tags: Victory celebrations banned in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *