పుంగనూరులో జాతీయలోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఆగస్టు 13న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సిందుతో కలసి, పోలీసులు, అధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి, ప్రజలకు సత్వరన్యాయం అందించేందుకే లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులలో అవగాహన కల్పించి, అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా కృషి చేసి, జాతీయలోక్‌అదాలత్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Tags: Victory for the National Lok Adalat in Punganur