ప్రజలలో ఉంటేనే గెలుపు

నల్గొండ     ముచ్చట్లు:

 

 

తెలంగాణ పీసీసీ పదవి తనకు రానందుకు చాలా బాధగా ఉందని ఆ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, అయినా ఆ పదవి ఇవ్వకుంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ రోజు అలా ఆవేదనతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరిలో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు.అనంతరం కోమటిరెడ్డి మాట్లాడారు. ‘‘చాలా పార్టీల నుంచి నాకు ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరమే లేదు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం కూడా లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతాం. గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం. ప్రజలతో మమేకమై గ్రూపులు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం. కేసీఆర్‌ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలి. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుంది. అంత మాత్రాన పార్టీ మారతారా? తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేసిన వ్యక్తిని నేను. నాకు ఏ పదవి అవసరం లేదు. భువనగిరి ఎంపీగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను గెలిపించారు’’ అని కోమటి రెడ్డి అన్నారు.ఓటుకు నోటు కేసు తరహాలోనే పీసీసీ సీటు కూడా కొన్నట్లుగా కోమటిరెడ్డి ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకమాండ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Victory if among the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *