Natyam ad

విజయం మాదే – వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్

సత్యవేడు  ముచ్చట్లు:

సత్యవేడు గడ్డపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరవేసి విజయోత్సవ సభ నిర్వహిస్తానని సత్యవేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ‘నూకతోటి రాజేష్’ ధీమా వ్యక్తం చేశారు! శుక్రవారం సత్యవేడు పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ స్కూటీని కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకుడు, తాడిపత్రి నియోజకవర్గం పరిశీలకుడు బీరేంద్ర వర్మ, మరో కీలక నేత భానుప్రకాష్ రెడ్డి తో కలిసి నూకతోటి రాజేష్ పాల్గొన్నారు, స్కూటీని కార్యక్రమం ముగిసిన తర్వాత అయినా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో నిలిచారని, రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు ఖాయమన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సంక్షేమం తప్ప పొత్తులు, కులసమీకరణలపై ఆధారపడి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

 

 

Post Midle

ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఎవరు విశ్వసనీయులో ప్రజలకు అర్థమవుతుందన్నారు. జగనన్న పాలన నిజాయతీ, నిబద్ధతతో సాగిందని, చంద్రబాబు పాలన మోసం, వంచనతో జరిగిందని రాజేష్ గుర్తు చేశారు. ఈరోజు ఒకరు ప్రజల పక్షాన నిలబడితే, మరొకరు పెత్తందారీ పక్షన నిలిచారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. పథకాలను కులమతాలు, పార్టీలకు అతీతంగా అందించినట్లు వలంటీర్‌, సచివాలయ వ్యవస్థలను పెట్టి ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలనను తీసుకెళ్లారన్నారు. వన్స్‌మోర్‌ జగనన్న అంటూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక అంతమొందించాలని చంద్రబాబు ప్రయత్నించాడన్నారు, తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మద్దెల గురుమూర్తిని, సత్యవేడు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి,

 

 

సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేశాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇవ్వడంతోపాటు, నూరు పేజీల మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు, ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాజేష్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని చెప్పారు. సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరు మీ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు, రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా చైతన్యం రావాలని నూకతోటి ప్రజలను కోరారు… ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు , ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Victory is ours – YCP MLA candidate Rajesh

Post Midle