వాల్మీకి జయంతిని జయప్రదం చేయండి

Victory to Valmiki

Victory to Valmiki

Date:10/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అద్దాలనాగరాజ పిలుపునిచ్చారు. గురువారం ఆయన వాల్మీకి సంఘ నాయకులతో కలసి జయంతి పోస్టర్లను , కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజ మాట్లాడుతూ ఈనెల 13న వాల్మీకి జయంతిని వాడవాడల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే వాల్మీకులను ఎస్టీల జాబితాలో తక్షణం చేర్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జయంతి వేడుకలలో ఈ మేరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించి అంచలంచలుగా వాల్మీకుల పోరాటాన్ని ఉధృతం చేసి, ఎస్టీల జాబితాలో చేర్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నప్ప, శ్రీనివాసులు, వెంకటరత్నం, గంగులప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి జన్మదినాన్ని పోటాపోటీలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Tags: Victory to Valmiki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *