ప్రభోధానంత చరిత్ర వీడియో రిలీజ్ చేస్తా

Video of the Authenticity History will be released

Video of the Authenticity History will be released

 Date:18/09/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రబోధానంద ఆశ్రమ చరిత్ర మొత్తం తనకు తెలుసంటున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రత్యక్షమైన ఎంపీ.. సీఎం చంద్రబాబును కలిశారు. దాదాపు అరగంటపాటూ సీఎంతో తాడిపత్రి గొడవ సహా పలుకీలక అంశాలపై చర్చించారట. తర్వాత జేసీ మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడగా.. తాడిపత్రి ఎపిసోడ్‌ కూడా ప్రస్తావనకు వచ్చిందట. ప్రబోధానంద వ్యవహారంలో తాను గెలిచానో.. ఓడానో మీడియానే తేల్చాలని ఆయన చమత్కరించారట.
స్వామీజీకి తాను సాష్టాంగపడ్డానని వచ్చిన ఆరోపణలపై స్పందించిన జేసీ.. ప్రబోధానందతో పెట్టుకొంటే నియోజకవర్గంలో ఇబ్బందులుంటాయని కామెంట్లు చేసే వారిలో గెలిచే వారెవ్వరూ లేరని వ్యాఖ్యానించారు. ప్రబోధానంద స్వామీజీకి బాధితులు చాలామంది ఉన్నారని.. త్వరలోనే కొన్ని వీడియోలను విడుదల చేస్తానని దివాకర్‌రెడ్డి అన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా మూడు రోజుల క్రితం ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే.
ఈ గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామస్తులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆశ్రమంలో బయటి వ్యక్తుల్ని అక్కడి నుంచి పంపేయాలని జేసీ పట్టుబట్టారు.
సోమవారం నాడు ఆశ్రమ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్, పోలీస్ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో బయటివారిని స్వస్థలాలకు పంపేందుకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించగా.. వాహానాల్లో వారిని అధికారులు తరలించారు. కేవలం ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతించారు. దీంతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఆందోళనను విరమించారు. ఈ వ్యవహారంపై సీఎంతో చర్చించేందుకు జేసీ మంగళవారం అమరావతికి వచ్చినట్లు తెలుస్తోంది.
Tags:Video of the Authenticity History will be released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *