Date:23/05/2020
చిత్తూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో ఒక కోటి 13 లక్షలా 69 వేల 172 కార్డులను ప్రింట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిదర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరావతి నుండి సివిల్ సప్లైస్ కమిషనర్ సివిల్ సప్లైస్ పై వివిధ జిల్లాల్లోని జిల్లా జాయింట్ కలెక్టర్లు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా సివిల్ సప్లైస్ కమిషనర్ మాట్లాడుతూ రేషన్ కార్డ్స్ కుటుంబ సభ్యులు ఎవరైనా e KYC డౌన్ లోడ్ చేయకుండా ఉంటే వాలంటీర్లు అటువంటి వారి చేత e KYC డౌన్ లోడ్ చేయించాలన్నారు. రాబోయే రెండు రోజులలో e KYC డౌన్ లోడ్, బయోమెట్రిక్ ను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. e KYC డౌన్ లోడ్ వంద కి వంద శాతం పూర్తి కావాలన్నారు. పాత కార్డులు పంపిణీ చేసిన వాటికి బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ సంధర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు సివిల్ సప్లైస్ కమిషనర్ కు వివరిస్తూ రాబోయే రెండు రోజులలో e KYC డౌన్ లోడ్ అలాగే బయోమెట్రిక్ ను పూర్తి చేస్తామని ఆయనకు తెలియజేశారు. మన జిల్లాలో ఈ నెల 16 నుండి ప్రారంభమైన సరుకుల పంపిణి కార్యక్రమం ఈ నెల 25 వ తేదితో పంపిణి ముగిస్తుందని కావున ఈ నెల 24 వ తేది లోగా ప్రజలు సరుకులను తీసుకొని వెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో డి.యస్.ఓ విజయ రాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలో గల సర్వైలెన్స్ టీమ్ లు పటిష్టంగా పని చేయాలి
Tags: Videoconference with District Joint Collectors etc.