అభివృద్ధిపై పైనే దృష్టంతా

View on the development itself

View on the development itself

Date:15/08/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
ఆర్ధికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విభజనతో నష్టపోయినా అభివృద్ధి ఆగకుండా చూశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించామని అన్నారు. సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలమని, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి దిగుబడులు పెంచి, రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.
రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆనంద ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి కొరతను అధిగమించామని, సౌర విద్యుత్, ఆటోమొబైల్ రంగాలను ప్రోత్సహించడంతో రాయలసీమలో అనేక పరిశ్రమలు స్థాపన జరిగిందని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా… సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. వీరులకు జన్మనిచ్చిన భూమి ఇదని…ఎందరో రాజకీయ, సాహిత్య రంగాల ప్రముఖులు శ్రీకాకుం జిల్లా బిడ్డలే అని అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగుజాతి ఖ్యాతిని పెంచారని తెలిపారు.
జాతిపునర్‌నిర్మాణానికి తామంతా పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు పేర్కొన్నారు.ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎందరో గొప్పనేతలకు నిలయమని, స్వాతంత్ర పోరాటంలో నాటి గుణ్ణమ్మ నుంచి నేటి కరణం మల్లేశ్వరి దాకా, సర్దార్ గౌతు లచ్చన్న నుంచి ఎర్రంనాయుడు దాకా ఎందరో తెలుగువారి ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేశారని తెలిపారు. 2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలబడాలనే ఉద్దేశంతో ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగుతున్నామని అన్నారు.
అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే స్వాతంత్రదినోత్సవ వేడుకలు అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని భావించామని అన్నారు. అందుకే తొలి ఏడాది కర్నూలు, రెండో ఏడాది విశాఖ, మూడో ఏడాది అనంతపురం, నాలుగో ఏడాది తిరుపతిలో నిర్వహించి ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుపుకుంటున్నామని తెలిపారువిభజన కష్టాలు వెంటాడుతున్నాయని..కేంద్రం సహకరించడం లేదని అన్నారు.
ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకుండా విపక్షాలు అడ్డుపతున్నాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో రెండు అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం తెలిపారు. ఎవరు సహకరించినా..సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధి కూలీని రూ. 140 నుంచి రూ. 205కు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇస్తున్నామని, చంద్రన్న బీమా, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాలతో పేదలకు ఆసరా కల్పించామన్నారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు చంద్రన్న పెళ్లికానుక అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతోత్వరత్వరగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఓవైపు వర్షం కురుస్తుండగానే చంద్రబాబు జెండాను ఎగురవేశారు.
అనంతరం రాష్ట్రపతి మెడల్స్ సాధించిన పోలీస్ అధికారులకు పతకాలను అందజేశారు. విభజన అనంతరం ఏపీలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 72 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు శ్రీకాకుళం వేదికైంది. పోలీసులతో గౌరవవందనం స్వీకరించిన చంద్రబాబు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మంగళవారం అడపాదడపా వర్షం కురువడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను చేశారు. ఉత్సవాలు నిర్వహించే పరేడ్‌ మైదానంలో రాత్రి టార్ఫాలిన్లు కప్పాల్సి వచ్చింది. శ్రీకాకుళం, పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా ఐదు వేల మంది విద్యార్థులు స్వాతంత్రదినోత్సవ వేడుకలకు తీసుకొచ్చారు.
Tags: View on the development itself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *