తెలంగాణ అసెంబ్లీ వైపు 16 మంది పుత్రరత్నాల చూపు

View the 16 sons of Telangana Assembly

View the 16 sons of Telangana Assembly

వారసులొస్తున్నారు…
Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఎన్నికల  సమరంలో నిలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు యువనాయకులు ఉత్సాహం చూపుతున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రత్యర్థులతో తలపడి సత్తాచాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. టికెట్లు సంపాదించుకునేందుకు పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. యువతకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ విజయపథంలో నడుస్తుందని పేర్కొంటూ ఈ ఎన్నికల్లో అర్హులైన యువ అభ్యర్థ్దులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నెలరోజుల క్రితం 105మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి అందులో కొత్తగా యువకుల జాబితాలో క్రాంతికిరణ్‌కు ఇవ్వగా, పాత యువనేతలైనా బాల్కసుమన్, పిడమర్తి రవి,  గాదరి కిషోర్, వేముల వీరేశంకు అందజేశారు.
ఆ పార్టీని మించి కాంగ్రెస్, టీడీపీ, మహాకూటమి, బీజేపీ నుంచి ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీ యువ విభాగం అధ్యక్షులు మందడి అనిల్‌కుమార్ యాదవ్, ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్ బరిలో తానే ఉంటానని కార్తీక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ కార్యదర్శి మారం రవికుమార్‌యాదవ్ తన తండ్రి స్థ్దానంలో పోటీ చేస్తానని చెబుతున్నారు. సూర్యాపేట నుంచి దామోదర్ తనయుడు సర్వోతంరెడ్డి ఈ సారి తాను బరిలో నిలిచి సత్తాచాటుతానని వెల్లడిస్తున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం తరుపున పోటీలో ఉంటానని జానారెడ్డి తనయుడు రఘవీర్‌రెడ్డి అనుచరులతో పేర్కొంటున్నారు. రేపోమాపో ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ నుంచి నిలబడుతానని క్రిశాంక్ అంటున్నారు. ఏడాది నుంచి అక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ కుమారుడు సంజయ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. టీడీపీ తరుపున ఉప్పల్ నుంచి దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ తానే అభ్యర్థినంటూ ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీలో కూడా యువనాయకులు తమను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
యువమోర్చా నాయకులు భరత్‌గౌడ్ నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కార్వాన్ నుంచి ఏ.వినయ్‌కుమార్ ఈసారి సీటు తనదేననంటూ చెబుతున్నారు. టీజేఎస్ తరుపున  మహేశ్వరం నియోజకవర్గం నుంచి పల్లె వినయ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే ప్రచారం చేపట్టారు. కోదండరాం పిలుపునిస్తే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అక్కడ నుంచి ఆయన సమరంలో తలపడుతున్నానని వెల్లడిస్తున్నారు. కోదాడలో తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ యువజన నేత అంజియాదవ్ పార్టీ అధినేత కోరుతున్నారు. సీపీఐ తరుపున మునుగోడు నుంచి నెల్లికంటి సత్యం పోటీకి కాలుదువ్వుతున్నారు.
మజ్లిస్ పార్టీ నాయకునిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని, చిన్న శ్రీశైలం కుమారుడు వల్లాల నవీన్‌కుమార్  ప్రచార రథంపై పరుగులు పెడుతున్నారు. తామేమి తక్కువ కాదంటూ యువరాణులు కూడా జెండాపడుతున్నారు.జహీరాబాద్ నుంచి మేఘనారెడ్డి, మక్తలో డి.కె. సిగ్ద్నారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం కావ్య, వరంగల్ తూర్పులో సున్మితాపటేల్  ఈసారి అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తామని పేర్కొంటున్నారు. హైకమాండ్ యువతీ, యువకులకు పార్టీలో సముచితం స్దానం కల్పించి భావితరాలకు ఉన్నత నాయకులుగా ఎదిగే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
Tags:View the 16 sons of Telangana Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *