ఆరోగ్య కేంద్రాలపై విజిలెన్స్ దాడులు
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజి శంఖ బ్రత భాగ్చి ఉత్తర్వుల మేరకు తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారి ఈశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి చిత్తూరు జిల్లాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి 2 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను తనిఖీ చేసారు. చిత్తూరు తిరుపతి జిల్లాలో రేణిగుంట పూతల పట్టులోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను పూత్తురు నగరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయని అంతేగాక ఆసుపత్రులలో సిబ్బంది పనితీరును, వసతులు, సౌకర్యాలు, నిర్వాహణ లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని శ్రీ కె.ఈశ్వర రెడ్డిగారు తెలిపారు.
Tags: Vigilance attacks on health centers

