టిటిడిలో విజిలెన్స్ అవ‌గాహ‌న వారోత్స‌వాలు

Date:26/10/2020

తిరుప‌తి ముచ్చట్లు:

కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్(సివిసి) పిలుపు మేర‌కు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు టిటిడి సంస్థల్లో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించ‌నున్న‌ట్టు ముఖ్య నిఘా మ‌రియు భ‌ద్ర‌తాధికారి   గోపీనాథ్ జెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఏటా ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.అవినీతి నిర్మూల‌న‌, దేశ సమగ్రత, నిఘా అంశాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు సివిసి ప్రతియేటా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా 27వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు టిటిడి పరిపాలన భవనంలో అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో “అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని” ప్రతిజ్ఞ చేయిస్తామ‌ని చెప్పారు. నవంబరు 2వతేదీ వరకు టిటిడిలోని అన్ని విభాగాల్లోని ఉద్యోగుల‌కు, తిరుమ‌ల‌లోని యాత్రికుల‌కు, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు, దుకాణ‌దారుల‌కు అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని టిటిడి సంస్థ‌ల వ‌ద్ద‌, ముఖ్య కూడ‌ళ్ల‌లో ఫ్లెక్సీలు, క‌ర‌ప‌త్రాల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని వివ‌రించారు.టిటిడి ఈఓ డా. కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేర‌కు సివిఎస్వో   గోపీనాథ్ జెట్టి ఈ విజిలెన్స్ వారోత్స‌వాల కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

Tags: Vigilance Awareness Week in TTD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *