మనుబోలు హాస్టళ్లను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు
నెల్లూరు ముచ్చట్లు:
మనుబోలు బాలుర బాలికల హాస్టళ్లను విజిలెన్స్ సిఐ మాణిక్యరావు ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లను తనిఖీకి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మనుబోలు బాలికల హాస్టల్లను తనిఖీ చేస్తున్నామని అన్నారు .హాస్టల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని పరీశలించామని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని అందుతున్నాయా లేదా అని తనిఖీ వివరించారు. అదేవిధంగా విద్యార్థులకు వసతి సరిగా ఉందా లేదా చూడడం జరిగిందన్నారు. హాస్టల్ లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు అవసరమైన సదుపాయాల గురించి వార్డన్లను ప్రశ్నించవచ్చని తెలిపారు. ఈ తనిఖీల అనంతరం పై అధికారులకు నివెదికను పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఓ సంగమేశ్వర రెడ్డి విఆర్వో శీనువాసులు వార్డెన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Vigilance officers who checked the hostels of Manubolu