కోమడవోలు లో విజిలెన్స్ దాడులు
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం కోమడవోలు గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరణం కుమార్ ఆదేశాలతో పిడిఎస్ రైస్ గోడౌన్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని వారు సీజ్ చేశారు ఈ బియ్యం యజమానిగా చెప్పబడుతున్న పవిత్ర కుమార్ పై కేసు నమోదు చేసారు. వీటి విలువ 91800గా వారు తెలిపారు దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ విల్సన్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: Vigilance raids in Komadavulu