నాలుగు భాష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్‌` టీజ‌ర్‌

Vijay Devarakonda is the 'Dear camarader' teaser in four languages
 Date:08/03/2019
 సినిమా ముచ్చట్లు:
సెన్సేష‌న‌ల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌  బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా `డియ‌ర్ కామ్రేడ్‌`. `యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` ట్యాగ్ లైన్‌. ఈ  సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.
సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా,  సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి  క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  భ‌ర‌త్ క‌మ్మ‌, నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని, సి.ఇ.ఒ:  చెర్రీ, సంగీతం: జ‌స్టిన్ ఫ్ర‌భాక‌ర‌న్‌, డైలాగ్స్‌:  జె కృష్ణ‌, ఆర్ట్‌:  రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్:  కె.వి.ఎస్‌.సుబ్ర‌మ‌ణ్యం, సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, ర‌హ‌మాన్‌,  కృష్ణ‌కాంత్‌,  కొరియోగ్ర‌ఫీ:  దినేష్ మాస్ట‌ర్‌, యాక్షన్ డైరెక్ట‌ర్‌:  జి.ముర‌ళి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌:  అనీల్, భాను, పి.ఆర్.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌.
Tags:Vijay Devarakonda is the ‘Dear camarader’ teaser in four languages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *