నాలుగు భాష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో`

Vijay Devarakonda is the hero of four languages
   Date:13/03/2019
ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందిస్తున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో చిత్రం చేయ‌బోతున్నారు. `హీరో` అనే పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిస్తారు. ఆనంద్ అన్నామలై ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏప్రిల్ 22 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అంత కంటే ముందు సినిమా ఎప్పుడు లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంది.. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు.
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం:  ఆనంద్ అన్నామ‌లై, నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర‌, మోహ‌న్‌(సి.వి.ఎం), సి.ఇ.ఒ:  చెర్రీ.
Tags:Vijay Devarakonda is the hero of four languages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *