విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం.. 

Vijay Devarakonda, Kranthamadhav movie

Vijay Devarakonda, Kranthamadhav movie

Date:12/10/2018
తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్మాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఈయ‌న చేస్తోన్న తొలి సినిమా ఇది. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర‌యూనిట్ తెలియ‌జేయ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి.
Tags:Vijay Devarakonda, Kranthamadhav movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *