Natyam ad

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌లను కలసిన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్- లైగర్ టీమ్

హైదరాబాద్ ముచ్చట్లు:

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- ‘అక్డీ పక్డీ ‘, వాట్ లగా దేంగే సినిమాపై  భారీ హైప్ , అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ, లైగర్ టీమ్ ముంబైలోని ఒక మాల్‌కి వెళ్లారు. బాలీవుడ్ ప్రెస్,  ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచే విధంగా ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్‌ను లైగర్ చిత్ర బృందం సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో గాడ్‌ఫాదర్‌ టీమ్‌ .. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లపై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది లైగర్ టీమ్. ఇద్దరు సూపర్ స్టార్స్  లైగర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Post Midle

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను.

 

Tags: Vijay Devarakonda, Puri Jagannadh, Charmi Kaur – Liger Team Meet Megastar Chiranjeevi, Superstar Salman Khan

Post Midle